Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఐజ మండలం నుంచి మెగా రైతు మేళాకు తరలివెళ్లిన రైతన్నలు

Author
Posted By Telangana Vaartha
| 09 Nov 2026, 08:10 PM | తాజావార్తలు Flash News
ఐజ మండలం నుంచి మెగా రైతు మేళాకు తరలివెళ్లిన రైతన్నలు

నాలుగు ఆర్టీసీ బస్సుల్లో 200 మంది కర్షకుల ప్రయాణం.

వ్యవసాయ, ఉద్యానవన మరియు మహిళా సంఘాల ఆధ్వర్యంలో తరలివెళ్లిన బస్సులు.

జోగులాంబ గద్వాల 9 నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. అయిజ. మండలం నుంచి దుద్యాల మండలం హకీమ్‌పేటలో నిర్వహించబడుతున్న మెగా రైతు మేళాకు రైతన్నలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం మరియు క్షేత్రస్థాయి ప్రదర్శనలను తిలకించేందుకు అయిజ మండలం నుంచి నాలుగు ప్రత్యేక ఆర్టీసీ బస్సుల ద్వారా సుమారు 200 మంది రైతులు హకీమ్‌పేటకు పయనమయ్యారు. ఈ రైతు మేళా ప్రయాణాన్ని మండల అధికారుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రెండు బస్సులు, ఉద్యానవన (హార్టికల్చర్) శాఖ ఆధ్వర్యంలో ఒక బస్సు, అలాగే మహిళా సంఘాల (మహిళా సమాఖ్య) ఆధ్వర్యంలో మరో బస్సు చొప్పున మొత్తం నాలుగు బస్సులలో రైతులు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమానికి అయిజ మండల వ్యవసాయ అధికారి జనార్ధన్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి క్రిష్ణయ్య, తహసిల్దార్ ఎన్. జ్యోతి మరియు మండల పంచాయతీ అధికారి మనోహర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. వ్యవసాయంలో వస్తున్న ఆధునిక మార్పులను, నూతన వంగడాలను, ప్రభుత్వ పథకాలను రైతులు ఈ మెగా రైతు మేళా ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. క్షేత్ర ప్రదర్శనల ద్వారా లభించే ఈ అవగాహన రైతుల సాగు విధానంలో ఎంతో మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.