Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

జాతీయ స్థాయి పోలీస్ క్రీడలకు సూర్యాపేట జిల్లా మహిళా పోలీస్ క్రీడాకారుల ఎంపిక..

Author
Posted By Telangana Vaartha
| 09 Nov 2026, 04:23 PM | తెలంగాణ Telangana
జాతీయ స్థాయి పోలీస్ క్రీడలకు సూర్యాపేట జిల్లా మహిళా పోలీస్ క్రీడాకారుల ఎంపిక..

తెలంగాణ రాష్ట్ర ఐదవ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌లో సత్తాచాటిన జిల్లా పోలీస్ క్రీడాకారులు.
మహిళా వాలీబాల్‌ క్రీడలో ప్రథమ, మహిళా కబడ్డీ క్రీడ ద్వితీయ బహుమతి.
ఎస్పి నరసింహ ఐపిఎస్ గారిని కలిసిన క్రీడాకారులు.
ఉత్తమ ప్రతిభ చూపి మంచి పేరు తేవాలి.. క్రీడాకారులను ప్రొత్సహస్తాం: జిల్లా ఎస్పీ కె. నరసింహ.
సూర్యాపేట, నవంబర్ 09:-
వరంగల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నందు గత వారం జరిగిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఐదవ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌లో సూర్యాపేట జిల్లా పోలీస్ క్రీడాకారులు అద్భుత ప్రతిభ చూపారు. పోలీస్ జోన్-5 తరఫున వివిధ క్రీడా పోటీల్లో ప్రాతినిధ్యం వహించిన జిల్లా పోలీస్ క్రీడాకారులు మహిళా వాలీబాల్‌లో ప్రథమ బహుమతి, మహిళా కబడ్డీలో ద్వితీయ బహుమతి సాధించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్పీ నర్సింహా ని క్రీడాకారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి క్రీడల్లో జోన్ 5 తరపున జట్టులో సూర్యాపేట జిల్లా పోలీసు క్రీడాకారులు ప్రతిభ చూపారని అభినందించారు. జోన్-5 మహిళా కబడ్డీ జట్టులో జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుళ్లు సీహెచ్. లత, ఎన్. దీపిక, ఎం. అనూష, ఎస్.కె. అనీఫా, ఈ. అరుంధతి, సీహెచ్. శిరీష . వాలీబాల్ జట్టులో జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుళ్లు కే. లావణ్య, బి. ప్రియాంక, కే. దివ్యభారతి, కే. ప్రవల్లిక ప్రాతినిధ్యం వహించి తమ ప్రతిభను చాటుకున్నారు. వీరి క్రీడా నైపుణ్యం, సమన్వయం, పట్టుదలతో జోన్-5 జట్టు పోటీల్లో బహుమతి సాధించింది అన్నారు. అలాగే ఈ కబడ్డీ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులు ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ స్పోర్ట్స్ మీకు తెలంగాణ రాష్ట్రం తరఫున జట్టుకు ఎంపిక చేయాలని అభినందించారు.
ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్‌కు జిల్లా క్రీడాకారుల ఎంపిక..
రాష్ట్రస్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన సూర్యాపేట జిల్లా పోలీస్ క్రీడాకారులు ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్‌కు ఎంపిక కావడం మరో విశేషం. మహిళా కబడ్డీ విభాగంలో సీహెచ్. లత, ఎన్. దీపిక, ఎం. అనూష, ఎస్.కె. అనీఫా తెలంగాణ రాష్ట్ర పోలీస్ జట్టు తరఫున ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్‌కు ఎంపికయ్యారు. ఈ పోటీలు వచ్చే నెలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్నాయి. అదేవిధంగా మహిళా వాలీబాల్ విభాగంలో కే. లావణ్య, బి. ప్రియాంక తెలంగాణ పోలీస్ జట్టు తరఫున జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలు వచ్చే నెలలో తమిళనాడు రాష్ట్రంలో నిర్వహించనున్నారు.
మహిళా కోకో విభాగంలో కే. దివ్యభారతి తెలంగాణ రాష్ట్ర పోలీస్ జట్టు తరఫున ఆల్ ఇండియా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో బహుమతులు సాధించడం, జాతీయస్థాయి పోలీస్ క్రీడలకు ఎంపిక కావడం సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు. రానున్న ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్‌లో కూడా ఇదే స్ఫూర్తితో మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచి జాతీయస్థాయిలో విజేతలుగా నిలిచి తెలంగాణ రాష్ట్రానికి, సూర్యాపేట జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే పోలీస్ సిబ్బందికి శాఖాపరంగా తగిన ప్రోత్సాహకాలు, అవకాశాలు లభిస్తాయని తెలిపారు. క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు క్రీడలకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్ఠను పెంచుతున్న క్రీడాకారులను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ అడ్మిన్ ప్రవీణ్ కుమార్, ఆర్‌ఐ జానయ్య, కబడ్డీ టీం కోచ్ ఎస్‌ఐ రామచందర్ గౌడ్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్, వాలీబాల్ టీం కోచ్ కానిస్టేబుల్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి పోలీస్ క్రీడలకు సూర్యాపేట జిల్లా మహిళా పోలీస్ క్రీడాకారుల ఎంపిక.. - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.