Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

సూర్యాపేట జిల్లా డీసీసీ మెడికల్ & హెల్త్ విభాగం చైర్మన్ గా డా. భార్గవ్ నియామకం

Author
Posted By Telangana Vaartha
| 09 Nov 2026, 01:22 AM |
సూర్యాపేట జిల్లా డీసీసీ మెడికల్ & హెల్త్ విభాగం చైర్మన్ గా డా. భార్గవ్ నియామకం

నియామక పత్రం అందజేసిన టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ - రాష్ట్ర చైర్మన్ డా. రాజీవ్
సూర్యాపేట, నవంబర్ 9:-
సూర్యాపేట జిల్లా డీసీసీ డాక్టర్ సెల్, మెడికల్ అండ్ హెల్త్ విభాగం చైర్మన్ గా డా. భార్గవ్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ డాక్టర్ సెల్ మెడికల్ అండ్ హెల్త్ విభాగం రాష్ట్ర చైర్మన్ డా. ఎం. రాజీవ్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా డా. భార్గవ్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో డాక్టర్ సెల్, మెడికల్ అండ్ హెల్త్ విభాగం సూర్యాపేట జిల్లా చైర్మన్ గా అవకాశం కల్పించిన రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు మందుల సామేల్, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, పీసీసీ నాయకులు పటేల్ రమేష్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పార్టీ బలోపేతానికి, వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించిన సేవా కార్యక్రమాల అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా డా. భార్గవ్ తెలిపారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.