Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: పేరూరు ఎస్సై అశోక్

Author
Posted By Alli prashanth kumar
| 08 Nov 2026, 07:28 AM | తాజావార్తలు Flash News
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: పేరూరు ఎస్సై అశోక్

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: పేరూరు ఎస్సై అశోక్

వాజేడు తెలంగాణ వార్త రిపోర్టర్ అల్లి ప్రశాంత్ కుమార్

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: పేరూరు ఎస్సై అశోక్ - Additional Image

: డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు పిల్లలను దూరంగా ఉంచి బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని పేరూరు పోలీస్ స్టేషన్ ఎస్సై అశోక్ అయ్యవారిపేట గ్రామం, 'కాపేడు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పిల్లల తల్లిదండ్రులకు మత్తు పదార్థాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడకుండా క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని పిల్లలు మంచి ఉద్యోగాలు సాధించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.
​సదస్సులో పాల్గొన్న ఎస్ఎఫ్ఐ ములుగు జిల్లా కార్యదర్శి టి.ఎల్. రవి మాట్లాడుతూ... నేటి యువత మత్తు పదార్థాల బారిన పడి పెడదారి పట్టకుండా విద్యార్థి దశ నుంచే అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్తు పదార్థాల విక్రయం, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. వాజేడు మండల కోఆర్డినేటర్ గొంది కామేశ్వరరావు, స్వరూప్, రమాదేవి, దీప, భాస్కర్, ప్రసాద్‌లతో పాటు సుమారు 70 మంది మహిళలు, గ్రామీణులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.