Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఎస్టీ కమిషన్ ఏర్పాటుపై హర్షం – ఆదివాసులకే నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలి

Author
Posted By Alli prashanth kumar
| 07 Nov 2026, 09:59 PM | తాజావార్తలు Flash News
ఎస్టీ కమిషన్ ఏర్పాటుపై హర్షం – ఆదివాసులకే నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలి

ఎస్టీ కమిషన్ ఏర్పాటుపై ఎస్టీ కమిషన్ ఏర్పాటుపై హర్షం – ఆదివాసులకే నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలిహర్షం – ఆదివాసులకే నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలి

భూమి, అటవీ హక్కుల పరిరక్షణే ఎస్టీ కమిషన్ లక్యంగా ఉండాలి


ఆదివాసీ సమస్యల పరిష్కారానికి ఎస్టీ కమిషన్ కీలక ముందడుగువేయాలి

ఇవి కూడా చదవండి

ఆదివాసి నవనిర్మాణ సేన వాజేడు మండల కార్యదర్శి తలడి ప్రసాద్

తెలంగాణ వార్త ములుగు స్టాప్ రిపోర్టర్ అది ప్రశాంత్ కుమార్ :-

​ తెలంగాణ ప్రభుత్వం ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని, తెలంగాణలోని ఆదివాసీ ప్రజల హక్కుల పరిరక్షణకు మరియు సామాజిక న్యాయ సాధనకు ఇది ఒక కీలకమైన ముందడుగు కావాలని ఆదివాసీ నవనిర్మాణ సేన మండల కార్యదర్శి తల్లడి ప్రసాద్ పేర్కొన్నారు.
​హక్కుల పరిరక్షణ – అడ్మినిస్ట్రేటివ్ నిఘా
భారత రాజ్యాంగం ఆదివాసీ గిరిజన సమాజానికి కల్పించిన హక్కులు, రక్షణలు మరియు సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలయ్యేలా ఎస్టీ కమిషన్ కృషి చేయాలని కోరారు. ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో రాజ్యాంగ నిబంధనలు, చట్టాల అమలును పర్యవేక్షించడంతో పాటు పెసా చట్టం, 1/70 భూ బదిలీ నిరోధక చట్టం అమలుపై ప్రత్యేక నిఘా ఉంచాలని డిమాండ్ చేశారు.
భూమి, విద్య, ఉద్యోగ సమస్యలపై ప్రత్యేక దృష్టి
ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న భూమి సమస్యలు, పోడు భూముల సమస్యలు, విద్యా, ఉద్యోగ, వైద్య రంగాల్లో వెనుకబాటుతనం, అటవీ హక్కులు మరియు రాజ్యాంగబద్ధమైన హక్కుల ఉల్లంఘనలపై కమిషన్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆదివాసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఫీజు రీయింబర్స్మెంట్, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వానికి తగిన సూచనలు చేయాలని స్పష్టం చేశారు.
ఆదివాసులకే నాయకత్వ బాధ్యతలు
ఆదివాసుల కోసం ఏర్పాటు చేసే కమిషన్‌లో ఆదివాసీలకే ప్రాతినిధ్యం మరియు నాయకత్వ అవకాశం కల్పించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కమిషన్ చైర్మన్ పదవిని ఆదివాసీ తెగకు చెందిన, అర్హత, సామర్థ్యం, జీవన విధానం మరియు సామాజిక నిబద్ధత కలిగిన వ్యక్తికే కేటాయించాలని కోరారు.

రక్షణ కవచంగా నిలవాలి
ఆదివాసీలపై జరుగుతున్న దాడులు, వివక్ష, దోపిడీ, అన్యాయాలపై తక్షణ విచారణ జరిపించి, వారి సంస్కృతి, భాష, సంప్రదాయాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎస్టీ కమిషన్ కేవలం పరిపాలనా వ్యవస్థగా కాకుండా ఆదివాసీల గొంతుకగా, వారి హక్కులకు రక్షణ కవచంగా నిలవాలని, ఇందులో ఆదివాసీ మేధావులు, విద్యావేత్తలు, న్యాయ నిపుణులు, సామాజిక ఉద్యమకారులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని ఆకాంక్షించారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.