Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఆయిల్ పామ్ తోటలలో విద్యుత్ లైన్ ల తొలగింపు పై సమన్వయ సమావేశం

Author
Posted By Telangana Vaartha
| 07 Nov 2026, 08:18 PM | తాజావార్తలు Flash News
ఆయిల్ పామ్ తోటలలో  విద్యుత్ లైన్ ల తొలగింపు పై సమన్వయ సమావేశం

ఆయిల్ పామ్ తోటలలో విద్యుత్ లైన్ ల వలన ఆయిల్ పామ్ రైతులకు కలుగుతున్న ఇబ్బందులు, వాటి తొలగింపు పై మహబూబాబాద్ జిల్లా ఆయిల్ పామ్ ఫార్మర్స్ అసోసియేషన్ తో కలసి శనివారం జిల్లా కలెక్టరేట్ లోని ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ శాఖ కార్యాలయంలో విద్యుత్ శాఖ మరియు ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సమన్వయ సమావేశంలో ఆయిల్ పామ్ తోటలలో ఉన్న 33 KV, 11 KV,& LT వంటి విద్యుత్ లైన్ లను ప్రభుత్వ నియమ నిబందలనల ప్రకారం 100 % టర్న్ కి పద్దతిలో, 10 % పర్యవేక్షణ చార్జీల మాపీ తో, చేయాలనీ, చర్చించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న, విద్యుత్ శాఖ డి.ఈ.లు ఎ. కోటేశ్వర్ రావు, డి. ఈ.(సాంకేతిక) కె. హీరాలాల్, "మహబూబాద్ జిల్లా ఆయిల్ పామ్ ఫార్మర్స్ అసోసియేషన్" అద్యక్షులు వి. క్రిష్ణారెడ్డి , ప్రధాన కార్యదర్శి బి. యాకుబ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఆర్. గోపాల్ రెడ్డి,సంయుక్త కార్యదర్శులు వి. వీర్య, టి. వీరన్న, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎస్. మధుకర్ రెడ్డి, ఎ. రామ రాజు, ఎస్. శ్రీపాల్ రెడ్డి, ఆర్. అజిత్ కుమార్, కె. లింగా రెడ్డి, ఎం. వెంకట రెడ్డి, డోర్నకల్ ఉద్యాన అధికారి, ఆర్. శాంతి ప్రియ, మహబూబాబాద్ ఉద్యాన అధికారి, ఎ.జె. శాంతి ప్రియదర్శిని, కార్యాలయ సిబ్బంది, ఆర్. జ్యోత్స్న రాణి, డి. కిషోర్, జి. కరుణాకర్ పాల్గొన్నారు.
డి.పి.ఆర్.ఓ, మహబూబాబాద్ చే జారీచేయనైనది.

ఇవి కూడా చదవండి

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.