Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

పదోన్నతి బాధ్యతను మరింత పెంచుతుంది — జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్

Author
Posted By Telangana Vaartha
| 07 Nov 2026, 08:17 PM | తాజావార్తలు Flash News
పదోన్నతి బాధ్యతను మరింత పెంచుతుంది — జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్

జోగులాంబ గద్వాల 7 నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల.ప్రమోషన్ పోలీస్ సేవలలో బాధ్యతను మరింత పెంచడం తో పాటు చేసే పనిలో ఉత్సాహన్ని కలిగిస్తుందని తద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించాలని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, IPS అన్నారు. మల్దకల్ పోలీస్ స్టేషన్ లో ASI విధులు నిర్వహిస్తున్న శ్రీ G. ఈశ్వరయ్య ఎస్సై గా పదోన్నతి పొందిన సందర్భంగా ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, IPS ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్వయంగా పదోన్నతి పొందిన అధికారికి స్టార్స్ తొడిగి, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ — ఉద్యోగ జీవితంలో పదోన్నతి అనేది కేవలం పదవిలో ఎదుగుదల మాత్రమే కాకుండా, బాధ్యతలు మరింతగా పెరిగే దశగా భావించాలి అని అన్నారు. పదోన్నతి ద్వారా వ్యక్తిలో కొత్త ఉత్సాహం, మరింత నిబద్ధత, సేవాభావం పెరగాలని ఆయన సూచించారు.
అదేవిధంగా, విధులను నిర్వర్తించే సమయంలో ఆరోగ్యాన్ని కూడా సమానంగా కాపాడుకోవాలని, శారీరక మరియు మానసికంగా దృఢంగా ఉండటం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని ఆయన వివరించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రతి పోలీసు అధికారి బాధ్యత అని పేర్కొన్నారు.

... .

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.