పదోన్నతి బాధ్యతను మరింత పెంచుతుంది — జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్

జోగులాంబ గద్వాల 7 నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల.ప్రమోషన్ పోలీస్ సేవలలో బాధ్యతను మరింత పెంచడం తో పాటు చేసే పనిలో ఉత్సాహన్ని కలిగిస్తుందని తద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించాలని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, IPS అన్నారు. మల్దకల్ పోలీస్ స్టేషన్ లో ASI విధులు నిర్వహిస్తున్న శ్రీ G. ఈశ్వరయ్య ఎస్సై గా పదోన్నతి పొందిన సందర్భంగా ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, IPS ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్వయంగా పదోన్నతి పొందిన అధికారికి స్టార్స్ తొడిగి, అభినందనలు తెలియజేశారు....