Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఉత్తనూర్ రైతు వేదికలో పంచాయతీ మేట్లకు శిక్షణ

Author
Posted By Telangana Vaartha
| 07 Nov 2026, 08:16 PM | తాజావార్తలు Flash News
ఉత్తనూర్ రైతు వేదికలో పంచాయతీ మేట్లకు శిక్షణ

వీబీ-జీరామ్‌జీ పథకంపై ప్రత్యేక అవగాహన
ప్రతి కూలీకి రోజువారీ వేతనం రూ. 308 అందేలా ఫీల్డ్‌లో మార్కవుట్ ఇవ్వడంపై మేట్లకు దిశానిర్దేశం.*
జోగులాంబ గద్వాల7 నవంబర్ 2026తెలంగాణ వార్త ప్రతినిధి.
ఐజ.మండల పరిధిలోని ఉత్తనూర్ గ్రామ పంచాయతీ రైతు వేదికలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల మేట్లకు 'వీబీ-జీరామ్‌జీ' పథకంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి క్రిష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వీబీ-జీరామ్‌జీ పథకం కింద పని చేసే ప్రతి కూలీకి ప్రభుత్వం నోటిఫై చేసిన వేతనం ప్రకారం రోజుకు రూ. 308 దక్కాలంటే ఏవిధంగా పని చేయించాలనే దానిపై క్షేత్రస్థాయిలో మార్కవుట్ ఇచ్చి మేట్లకు పూర్తి అవగాహన కల్పించారు. ప్రతి మేట్ తమ పరిధిలో కనీసం 40 మందికి తగ్గకుండా కూలీలకు పని కల్పించాలని సూచించారు. అలా చేస్తేనే కూలీలతో పాటు మేట్లకు కూడా రోజువారీ వేతనం సక్రమంగా అందుతుందని స్పష్టం చేశారు. అలాగే జలసిరి పనులకు సంబంధించి ఫీల్డ్‌లో మార్కవుట్ ఇచ్చి ఆ పనులను ఎలా నిర్వహించాలో వివరంగా తెలియజేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో వీబీ-జీరామ్‌జీ పథకం ఏపీవో లాలూ నాయక్, సాంకేతిక సహాయకులు, క్షేత్ర సహాయకులు మరియు గ్రామ పంచాయతీ మేట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఉత్తనూర్ రైతు వేదికలో పంచాయతీ మేట్లకు శిక్షణ - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.