ఉత్తనూర్ రైతు వేదికలో పంచాయతీ మేట్లకు శిక్షణ

వీబీ-జీరామ్‌జీ పథకంపై ప్రత్యేక అవగాహన ప్రతి కూలీకి రోజువారీ వేతనం రూ. 308 అందేలా ఫీల్డ్‌లో మార్కవుట్ ఇవ్వడంపై మేట్లకు దిశానిర్దేశం.* జోగులాంబ గద్వాల7 నవంబర్ 2026తెలంగాణ వార్త ప్రతినిధి. ఐజ.మండల పరిధిలోని ఉత్తనూర్ గ్రామ పంచాయతీ రైతు వేదికలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల మేట్లకు 'వీబీ-జీరామ్‌జీ' పథకంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి క్రిష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వీబీ-జీరామ్‌జీ పథకం కింద పని చేసే ప్రతి కూలీకి ప్రభుత్వం నోటిఫై చేసిన వేతనం ప్రకారం రోజుకు రూ. 308 దక్కాలంటే ఏవిధంగా పని చేయించాలనే దానిపై క్షేత్రస్థాయిలో...