Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

జాతీయ అవార్డు గ్రహీత కాశపోగు జానుకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం

Author
Posted By Telangana Vaartha
| 07 Nov 2026, 08:14 PM | తాజావార్తలు Flash News
జాతీయ అవార్డు గ్రహీత కాశపోగు జానుకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్  ఆధ్వర్యంలో ఘన సన్మానం

టీఎన్జీవో భవనంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం.

జోగులాంబ గద్వాల 7 నవంబర్ తెలంగాణ వార్తా ప్రతినిధి.దరూర్. జాతీయ అవార్డు గ్రహీత, దళిత జర్నలిస్టుల పోరం వ్యవస్థాపకులు కాశపోగు జానుకు గద్వాలలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. టీఎన్జీవో భవనంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.

ఈ సన్మాన కార్యక్రమానికి జిల్లాలోని జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. కాశపోగు జానును శాలువాతో సన్మానించి, పూలమాల వేసి గౌరవించారు.

ఇవి కూడా చదవండి

జర్నలిజంలో సేవలకు గుర్తింపు:
దళిత జర్నలిస్టుల కోసం పోరాడి, వారి హక్కుల కోసం నిలబడి జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న కాశపోగు జాను సేవలు అందరికీ ఆదర్శమని ఈ సందర్భంగా జర్నలిస్టులు అన్నారు. ఇలాంటి వ్యక్తిని సన్మానించడం జిల్లా జర్నలిస్టులందరికీ గర్వకారణమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు వాల్మీకి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి దాద పోగు వెంకటన్న, జిల్లా ఉపాధ్యక్షులు మన్నపురం వడ్డే రాములు, ఆరగిద్ద చారి,కుర్వ విష్ణు, బలిజ అనిల్, శాంతినగర్ ఆంజనేయులు తెలుగు రాజు తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.