జాతీయ అవార్డు గ్రహీత కాశపోగు జానుకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం
టీఎన్జీవో భవనంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం. జోగులాంబ గద్వాల 7 నవంబర్ తెలంగాణ వార్తా ప్రతినిధి.దరూర్. జాతీయ అవార్డు గ్రహీత, దళిత జర్నలిస్టుల పోరం వ్యవస్థాపకులు కాశపోగు జానుకు గద్వాలలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. టీఎన్జీవో భవనంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి జిల్లాలోని జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. కాశపోగు జానును శాలువాతో సన్మానించి, పూలమాల వేసి గౌరవించారు. జర్నలిజంలో సేవలకు గుర్తింపు: దళిత జర్నలిస్టుల కోసం పోరాడి, వారి హక్కుల కోసం నిలబడి జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న కాశపోగు జాను సేవలు అందరికీ ఆదర్శమని ఈ...