Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ప్రజల అభిప్రాయాలు అభ్యంతరాల స్వీకరణ

Author
Posted By Alli prashanth kumar
| 07 Nov 2026, 01:09 PM | Array
ప్రజల అభిప్రాయాలు అభ్యంతరాల స్వీకరణ

వాజేడు,నవంబర్ 6 తెలంగాణ వార్త విలేఖరి:- జిల్లా వాజేడు మండలం చింతూరు గ్రామపంచాయతీ పరిధిలోని అర్లగూడెం గ్రామంలో ప్రతిపాదిత ఇసుక రీచ్ ఏర్పాటుకు సంబంధించి శుక్రవారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వరంగల్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో అర్లగూడెం అంగన్వాడీ కేంద్రంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 10.50 హెక్టార్ల విస్తీర్ణంలో ప్రతిపాదించిన ఇసుక రీచ్కు సంబంధించి పర్యావరణ అనుమతుల ప్రక్రియలో భాగంగా ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఇసుక తవ్వకాల వల్ల నదీ పరిసరాలు, పర్యావరణ సమతుల్యత, భూగర్భ జలాలు, వ్యవసా యం, స్థానిక ప్రజల జీవన విధానంపై పడే ప్రభావాలను పరిగణనలోకి తీసుకుంటూ ప్రజల అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలను అధికారులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ సీహెచ్. మహేందర్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వరంగల్ ప్రాంతీయ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో మాట్లాడుతున్న అధికారి ఏఈ సుభాష్, టీజీఎండీసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ వంగ వెంకటేశ్వర్లు, టీజీఎండీసీ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే వాజేడు తహసీల్దార్, ఎంపీడీఓ, వాజేడు ఎస్సై సతీష్ తో పాటు స్థానిక గ్రామ ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతిపాదిత ఇసుకరీచ్ వల్ల పర్యావరణంపై కలిగే ప్రభావాలు, నదీ పరిసరాల పరిరక్షణ, స్థానిక ప్ర జల ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ప్రజా భిప్రాయాలను సేకరించారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలను అధికారులు స్వీకరించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కను అందజేస్తూ పచ్చదనం ఆవశ్యకతను చాటారు. కార్యక్రమానికి హాజరైన గ్రామస్తులు, కార్యాలయం ఇన్చార్జి పర్యావరణ ఇంజినీర్ సునీత,

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.