ప్రజల అభిప్రాయాలు అభ్యంతరాల స్వీకరణ
వాజేడు,నవంబర్ 6 తెలంగాణ వార్త విలేఖరి:- జిల్లా వాజేడు మండలం చింతూరు గ్రామపంచాయతీ పరిధిలోని అర్లగూడెం గ్రామంలో ప్రతిపాదిత ఇసుక రీచ్ ఏర్పాటుకు సంబంధించి శుక్రవారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వరంగల్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో అర్లగూడెం అంగన్వాడీ కేంద్రంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 10.50 హెక్టార్ల విస్తీర్ణంలో ప్రతిపాదించిన ఇసుక రీచ్‌కు సంబంధించి పర్యావరణ అనుమతుల ప్రక్రియలో భాగంగా ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఇసుక తవ్వకాల వల్ల నదీ పరిసరాలు, పర్యావరణ సమతుల్యత, భూగర్భ జలాలు, వ్యవసా యం, స్థానిక ప్రజల జీవన విధానంపై పడే ప్రభావాలను...