Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

మార్కెట్ యార్డ్ లో లారీ యజమానులు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 06 Nov 2026, 10:57 PM | తెలంగాణ Telangana
మార్కెట్ యార్డ్ లో లారీ యజమానులు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు

తిరుమలగిరి 07 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ప్రస్తుతం లారీ యజమానులు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ధాన్యం, పత్తి, ఇతర పంటల తరలింపులో లారీలదే ప్రధాన పాత్ర ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మార్కెట్ కు వచ్చే సరుకులో ఎక్కువ భాగం డీసీఎం ల లోనే తరలిపోతుండటంతో లారీలకు లోడ్ దొరకడం లేదు. రోజుల తరబడి మార్కెట్ యార్డ్ బయట లారీలు ఖాళీగా నిలిచిపోతున్నాయి. డీజిల్ ధరలు పెరిగిపోయి, ఇన్సూరెన్స్, ట్యాక్స్, ఫైనాన్స్ కట్టలేక లారీ యజమానులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
ఇదిలా ఉంటే మరో వైపు నిబంధనలకు విరుద్ధంగా ఓవర్ లోడ్ తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. టన్నేజీ కంటే అధిక లోడు వేసుకుని డీసీఎంలు, ఇతర వాహనాలు రోడ్లపై దూసుకుపోతున్నా పట్టించుకునే నాథుడే లేడు. దీని వల్ల ఒక వైపు రోడ్లు దెబ్బతింటుంటే, మరో వైపు ప్రమాదాల ముప్పు పెరుగుతోంది.నిబంధనల ప్రకారం: వాహనం సామర్థ్యానికి మించి లోడు వేయకూడదు. కానీ మార్కెట్ పరిసరాల్లో, ప్రధాన రహదారులపై ఈ నిబంధన అమలు కావడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తనిఖీలు లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని వారు వాపోతున్నారు. నిబంధనలు అందరికీ సమానంగా వర్తించాలని, మార్కెట్ లో లోడ్ పంపిణీలో పారదర్శకత పాటించాలని లారీ ఓనర్స్ డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ యార్డ్ లో లారీలకు ప్రాధాన్యం ఇచ్చి, ఓవర్ లోడ్ పై కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో లారీ రంగమే కుదేలైపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

మార్కెట్ యార్డ్ లో లారీ యజమానులు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.