మార్కెట్ యార్డ్ లో లారీ యజమానులు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు
తిరుమలగిరి 07 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ప్రస్తుతం లారీ యజమానులు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ధాన్యం, పత్తి, ఇతర పంటల తరలింపులో లారీలదే ప్రధాన పాత్ర ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మార్కెట్ కు వచ్చే సరుకులో ఎక్కువ భాగం డీసీఎం ల లోనే తరలిపోతుండటంతో లారీలకు లోడ్ దొరకడం లేదు. రోజుల తరబడి మార్కెట్ యార్డ్ బయట లారీలు ఖాళీగా నిలిచిపోతున్నాయి. డీజిల్ ధరలు పెరిగిపోయి, ఇన్సూరెన్స్, ట్యాక్స్, ఫైనాన్స్ కట్టలేక లారీ యజమానులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇదిలా ఉంటే మరో వైపు నిబంధనలకు విరుద్ధంగా...