Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి

Author
Posted By Telangana Vaartha
| 06 Nov 2026, 10:45 PM | తెలంగాణ Telangana
మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి

మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి : తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు బిషప్ ఎం.డి. సుదర్శనం
ఖమ్మం:-
హైదరాబాద్‌లోని అస్మూన్ గూడ ప్రాంతంలో క్రైస్తవ యువతులపై జరిగిన దాడి ఘటనను తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి మతపరమైన దాడులు సమాజంలో అశాంతికి దారితీస్తాయని, దేశంలో ఎక్కడా ఇటువంటి ఘటనలకు తావుండకూడదని కౌన్సిల్ నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం ఖమ్మం పట్టణంలో జరిగిన సమావేశంలో కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు బిషప్ ఎం.డి. సుదర్శనం మాట్లాడుతూ ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికీ తమ మత విశ్వాసాలను స్వేచ్ఛగా ఆచరించే హక్కు రాజ్యాంగం కల్పించిందని గుర్తు చేశారు. ఒక మతానికి చెందిన వారిపై మరో మతానికి చెందిన వ్యక్తులు దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు . అస్మూన్ గూడలో క్రైస్తవ యువతులపై దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి, పోలీసు శాఖకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా బాధితులకు న్యాయం చేయడంతోపాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం మత సామరస్యానికి, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు . హిందూ, ముస్లిం, క్రైస్తవ తదితర అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవం , ప్రేమాభిమానాలతో కలిసిమెలిసి జీవించాలని సూచించారు. మతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలను ప్రజలందరూ ఐక్యంగా ఎదుర్కోవాలని కోరారు. ఏ మతానికి చెందిన మహిళలు, యువతులు, ఇతరులపై మతపరమైన దాడులు జరిగినా ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సమాజంలో శాంతిభద్రతలు, మత సామరస్యం కాపాడేందుకు మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పరస్పర విశ్వాసం, సోదరభావం ద్వారానే సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సకినాల డేవిడ్, రాష్ట్ర సెక్రెటరీ పూర్ణకంటి ఏసుదాసు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం నిరీక్షణ రావు, రాష్ట్ర కన్వీనర్ సిహెచ్ రమేష్ బాబు, రాష్ట్ర నాయకులు మధుసూదన్ రావు, రాష్ట్ర ప్రేయర్ సెల్ అధ్యక్షులు జార్జి ముల్లర్, మహిళా నాయకురాలు వసంతమ్మ జాన్, ఖమ్మం టౌన్ అధ్యక్షులు జి పాల్ సంజీవరావు, మండల అధ్యక్షులు జాన్ ప్రకాష్, ఇశ్రాయేలు, జీవరత్నం, ప్రేమ్ సాగర్, ఆనందరావు, జాన్ వెస్లీ, కిషోర్, పాల్, యోబు , నవీన్, జోసఫ్ నాయక్, సత్యపాల్, ప్రసాద్, జాన్, పాల్ రాజ్ మరియు రాష్ట్ర, జిల్లా, మండల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు .

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.