మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి

మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి : తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు బిషప్ ఎం.డి. సుదర్శనం ఖమ్మం:- హైదరాబాద్‌లోని అస్మూన్ గూడ ప్రాంతంలో క్రైస్తవ యువతులపై జరిగిన దాడి ఘటనను తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి మతపరమైన దాడులు సమాజంలో అశాంతికి దారితీస్తాయని, దేశంలో ఎక్కడా ఇటువంటి ఘటనలకు తావుండకూడదని కౌన్సిల్ నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం ఖమ్మం పట్టణంలో జరిగిన సమావేశంలో కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు బిషప్ ఎం.డి. సుదర్శనం మాట్లాడుతూ ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికీ తమ మత విశ్వాసాలను స్వేచ్ఛగా ఆచరించే...