Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 06 Nov 2026, 10:45 PM | తెలంగాణ Telangana
ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

తిరుమలగిరి 07 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో గత 30 ఏళ్లకు పైగా గత పాలకుల నిర్లక్ష్యంతో ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాల తేలేకపోయిన నాయకులు ప్రజాప్రతినిధులు ఎంతోమంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు పలు పార్టీల నాయకులు ధర్నాలు రాస్తారోకోలు చేసిన నిధులు వెచ్చించకుండా కాలయాపన చేసిన గత పాలకుల నిర్లక్ష్యంతో తిరుమలగిరి వెనుకబాటుకు కారణమని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ అన్నారు ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మందుల సామెల్ అనంతరం వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో మాట ప్రకారం తిరుమలగిరి కి జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తానని హామీ ప్రకారం అమలు చేస్తున్న అన్నారు ప్రతి సంవత్సరం 1000 నుంచి 1500 మంది విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్ కు పై చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు ఇక్కడ జూనియర్ కళాశాల లేక ఇతర జిల్లాలకు వెళ్లడం వల్ల ఖర్చులు అధికంగా వస్తున్నాయని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన చెందుతూ మండలంలోని జూనియర్ కళాశాల కావాలని పట్టుబట్టడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్య వైద్య కోసం అధిక నిధులను కేటాయించడంతో సీఎం రేవంత్ రెడ్డి కృషితో జూనియర్ కళాశాలను ఏర్పాటయింది తుంగతుర్తి నియోజకవర్గం తరఫున వారికి కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు వచ్చిన వారికి 50 వేల రూపాయలు ప్రకటించారు ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో ప్రభుత్వాలు ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చినా కానీ ఈ తిరుమలగిరికి కళాశాలను తీసుకురాలేదు వారికి వ్యాపారంపై ప్రేమ ఉన్నది కానీ బీదవారికి చదువు నేర్పే కృషి లేకపోవడంతో విద్య వెనుకబడ్డది అన్నారు తిరుమలగిరి మండల కేంద్రంలోని తొండ వద్ద 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మించడం జరుగుతుందన్నారు తుంగతుర్తి లో వంద పడకల హాస్పిటల్ కూడా సీఎం రేవంత్ రెడ్డితో ప్రారంభోత్సవం చేస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో డి ఈ రమేష్ ఎంఈఓ శాంతయ్య జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మృత్యుంజయ జెడ్ పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ తో పాటు మున్సిపాలిటీ చైర్మన్. మార్కెట్ చైర్మన్ చామంతి నరేష్
మండల పార్టీ అధ్యక్షుడు సుంకరి జనార్ధన్ ఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్ మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లు పలు గ్రామాల సర్పంచులు మాజీ సర్పంచులు.యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ పలు అనుబంధ సంఘాల నాయకులు కళాశాల విద్యార్థులు. కార్యకర్తలు పాల్గొన్నారు

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.