Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె నోటీసు

Author
Posted By Telangana Vaartha
| 06 Nov 2026, 10:24 PM | తెలంగాణ Telangana
ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె నోటీసు

తుంగతుర్తి మండల కేంద్రంలో తుంగతుర్తి ఆరోగ్య శాఖ అధికారి లింగమూర్తి ని కలిసి
ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె నోటీసును అందజేసిన భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ (BRTU) నియోజకవర్గ అధ్యక్షులు గౌడిచర్ల సత్యనారాయణగౌడ్.
మండల ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు మేకల జయమ్మ

తుంగతుర్తి:- ఈ సందర్బంగా అయన వైద్య అధికారితో లింగమూర్తి తో ఆశాలు ఎదుర్కొంటున్న సమస్యల గురుంచి తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు రూ. 18,000/-లు పిక్స్డ్ వేతనం నిర్ణహించాలి. అదేవిదంగా వారికి ESI, PF సౌకర్యం మరియు ఉద్యోగభద్రత కల్పించాలని,ఇట్టి సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని లేని యెడల 2026 డిసెంబర్ 15 నుండి సమ్మెలోకి వెళతామని అన్నారు.
రాష్ట్రంలో ఆశా వర్కర్లు 28 వేల మంది 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు . మీరంతా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళలు రూరల్ వెయ్యి మంది పట్టణంలో 2000 మంది నుండి 5000 మంది ప్రజలకు ఆశాలు సేవలందిస్తున్నారు గర్భిణీ స్త్రీలు డెలివరీ అయ్యేవిధంగా చూస్తూ తల్లి బిడ్డలకు ప్రాణాలను కాపాడడం కీలకపాత్ర పోషిస్తున్నారు, దీంతో పాటు సీజనల్ వ్యాధులు అంటువ్యాధులు దీర్ఘకాలిక వ్యాధుల నుండి అరికడుతున్నారు. కరోనా మహమ్మారి నుండి కట్టడి చేయడంలో ఆశలు కీలకపాత్ర పోయించారు.డబ్ల్యూ సిహెచ్ఓ ఆశాలను గ్లోబల్ లీడర్స్ గా ప్రకటించింది ఉదయం 9 గంటల నుండి నాలుగు గంటల వరకు సబ్ సెంటర్ డ్యూటీలు ఏఎంసీలు పిఎన్సిలు టార్గెట్స్ ఎన్సీడీలు ఆన్లైన్ సర్వేలు స్కూట్అప్ డబ్బాలను మోయడం ఎగ్జామ్లో డ్యూటీలు డే బై డే ఫ్రైడే లెప్రసీ పోల్స్ పోలియో అనేక తదితర పనులను కూడా ఉదయం నుండి రాత్రి వరకు పనిచేస్తున్నారు. ఇంత శ్రమ చేస్తున్న ఆశలకు నేటికీ రాష్ట్రంలో ఫిక్స్డ్ వేతనం లేదు కేవలం 9900 మాత్రమే అందుతున్నాయి. ఇతర సౌకర్యాలు లేవు మూడు సంవత్సరాల నుండి పారితోషకాలు పెరగలేదు. నిత్యవసర వస్తువులు ధరలు ఆకాశం అంటుకుంటున్న కానీ వేతనంలో మార్పు లేదు పని భారం పెరిగి వచ్చే పారితోషకాలు సరిపోక ఆశలు అనేకమంది ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆశాల సమస్యల పరిష్కారం కోసం 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులు నిరవధిక సమ్మె చేశారు. ఈ సంఘ సందర్భంగా అక్టోబర్ 9న హైదరాబాదులో కోటి కమిషనర్ ఆఫీసు ముందు జరిగిన ధర్నా సందర్భంగా గత ప్రభుత్వం అనాటి అధికారులు నాయకులతో చర్చలు జరిపారు ఆశా సమస్యల పరిష్కారంతో కూడినటువంటి ఐఏఎస్ ల తో కూడిన ఓ కమిటీ వేస్తామని ఆ కమిటీ ఆశల సమస్యల కోసం పరిష్కారం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఆశాలకు వేతనాలు పెంచుతామని ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఈఎస్ ఐ,పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులకు ఆశలు చేస్తున్న పోరాటంలో ప్రత్యక్ష పాల్గొని మేము అధికారంలోకి వస్తే మీరు అడిగిన డిమాండ్స్ అని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.గత ప్రభుత్వమైనటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఆశలకు ఉన్న వేతనం 2వేల రూపాయకు కానీ కెసిఆర్ గారు వారి వేతనం ను 4 రెట్లు పెంచి 9900/-లు అందించటం జరిగింది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచింది ఏమీ లేదని అన్నారు.రాష్ట్రంలో ఆశాలు అనేక చేశారు హైదరాబాద్ కోటి కమిషనర్ ఆఫీస్ ముందు చేసిన పోరాటాల సందర్భంగా 2024 ఫిబ్రవరి 9న జులై డిసెంబర్ 10న రాష్ట్ర ఉన్నతాధికారులు ఆశలకు 50 లక్షల ఇన్సూరెన్స్ 50 వేల రూపాయలు మట్టి ఖర్చులు రిటర్మెంట్ బెనిఫిట్స్ సెలవులు టార్గెట్స్ స్పూటమ్స్ బొమ్మమ్ డబ్బాలు మోయడం రద్దు,ఇప్పటివరకు ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. అందుకని భారత రాజ్యాంగంలో పారిశ్రామిక వివాదల చట్టం ప్రకారం 1947 లోని సెక్షన్ -22, సబ్ సెక్షన్ (1) అనుసరించి డిసెంబర్ 15 న జరిగే సమ్మెకు నోటీసు ఇస్తున్నమని అన్నారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము స్పందించి ఆశాల డిమాండ్స్ పరిష్కరించాలని లేని సమ్మె లో పాల్గొంటామని అన్నారు. ఈకార్యక్రమంలో BRTU ఆశా మండల అధ్యక్షులు మేకల జయమ్మ,ఉపాధ్యకులు రమ ప్రధాన కార్యదర్శి గాజుల నాగలక్ష్మి, యాకలక్ష్మి, సునీత, సరస్వతి ఆశాలు తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.