Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఐఐహెచ్‌ఎం చారిత్రాత్మక అవగాహన ఒప్పందం

Author
Posted By Telangana Vaartha
| 06 Nov 2026, 04:14 PM | ఆంధ్రప్రదేశ్ Andra Pradesh, జాతీయం National
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఐఐహెచ్‌ఎం చారిత్రాత్మక అవగాహన ఒప్పందం

తిరుపతి, 06 నవంబర్, 2026:- ఐఐహెచ్‌ఎం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU)కుదుర్చుకుంది. తిరుపతిలో జరిగిన 31వ సీఐఐ (CII) పార్టనర్‌షిప్ సమ్మిట్ 2026 ప్రాంతీయ సదస్సు సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. IIHM తరపున సంస్థ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ డాక్టర్ సుబర్ణో బోస్ ఈ భాగస్వామ్యంలో పాల్గొన్నారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా సర్వీస్ ఆపరేషన్స్ మరియు డెస్టినేషన్ మేనేజ్‌మెంట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి సరికొత్త సాంకేతికతలను కూడా జోడించనున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరియు నిరుద్యోగ యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అందించడంలో కీలక మైలురాయిగా నిలవనుంది.ఈ కార్యక్రమంలో ఐఐహెచ్ఎం హైదరాబాద్ డైరెక్టర్ ఎర్నెస్ట్ ఇమ్మాన్యుయేల్, సిటీ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యువజనాభివృద్ధి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ (IAS), సీనియర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి చిరంజీవ్ చౌదరి, మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి (APEDB) ముఖ్య కార్యనిర్వహణాధికారి సాగిలి షాన్ మోహన్ (IAS) ఉన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.