ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఐఐహెచ్‌ఎం చారిత్రాత్మక అవగాహన ఒప్పందం

తిరుపతి, 06 నవంబర్, 2026:- ఐఐహెచ్‌ఎం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU)కుదుర్చుకుంది. తిరుపతిలో జరిగిన 31వ సీఐఐ (CII) పార్టనర్‌షిప్ సమ్మిట్ 2026 ప్రాంతీయ సదస్సు సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. IIHM తరపున సంస్థ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ డాక్టర్ సుబర్ణో బోస్ ఈ భాగస్వామ్యంలో పాల్గొన్నారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా సర్వీస్ ఆపరేషన్స్ మరియు డెస్టినేషన్ మేనేజ్‌మెంట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి సరికొత్త సాంకేతికతలను కూడా జోడించనున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరియు నిరుద్యోగ యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అందించడంలో కీలక మైలురాయిగా నిలవనుంది.ఈ కార్యక్రమంలో ఐఐహెచ్ఎం హైదరాబాద్ డైరెక్టర్ ఎర్నెస్ట్ ఇమ్మాన్యుయేల్, సిటీ ప్రైవేట్...