Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ పేదలకు ఉపాధి హామీ పనులు కల్పించాలి

Author
Posted By Telangana Vaartha
| 05 Nov 2026, 07:35 PM | తాజావార్తలు Flash News
మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ పేదలకు ఉపాధి హామీ పనులు కల్పించాలి

మేట్లకు కనీస వేతనం నిర్ణయించి, ఫీల్డ్ అసిస్టెంట్ల వేతనాలు పెంచాలి

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గోడిశాల వెంకన్న

మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న పట్టణ పేదలకు ఉపాధి హామీ పనులు కల్పించి, వలసలను నివారించి పేదలను ఆదుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గోడిశాల వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రేపు నవంబర్ 6న హైదరాబాద్‌లోని CRD కార్యాలయం ఎదుట తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ నవంబర్ 5న కేసముద్రం మండలం లోని విలేజ్ కేసముద్రం వివిధ కాలనీలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా గోడిశాల వెంకన్న మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పడటంతో మహబూబాబాద్, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు, కేసముద్రం మున్సిపాలిటీలలో గ్రామాలు, తండాలు విలీనం అయ్యాయని తెలిపారు. దీంతో గతంలో ఉపాధి హామీ కూలీలుగా పనిచేసిన పేదలందరికీ ఉపాధి పనులు దూరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మున్సిపాలిటీలలో ఉపాధి లేక పేదలు పొట్టకూటి కోసం సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని, ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడి వ్యవసాయ పనులు కూడా దొరకడం కష్టంగా మారిందన్నారు. జిల్లాలో భారీ పరిశ్రమలు లేకపోవడంతో కూలీలు పనులు దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మున్సిపాలిటీ పరిధిలోని పేదలకు తక్షణమే ఉపాధి హామీ పనులు కల్పించాలని, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించి రోజుకు రూ.800 కూలి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధి పనుల నిర్వహణలో కీలకంగా పనిచేస్తున్న మేట్లకు కనీస వేతనం నిర్ణయించాలని, ఫీల్డ్ అసిస్టెంట్ల వేతనాలు పెంచాలని కోరారు. అలాగే ఉపాధి పనులు జరిగే ప్రాంతాల్లో కనీస మౌలిక సౌకర్యాలను మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రేపు 6న హైదరాబాద్‌లోని CRD కార్యాలయం ఎదుట జరిగే మహాధర్నాకు వ్యవసాయ కార్మికులు, పట్టణ పేదలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.