మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ పేదలకు ఉపాధి హామీ పనులు కల్పించాలి

మేట్లకు కనీస వేతనం నిర్ణయించి, ఫీల్డ్ అసిస్టెంట్ల వేతనాలు పెంచాలి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గోడిశాల వెంకన్న మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న పట్టణ పేదలకు ఉపాధి హామీ పనులు కల్పించి, వలసలను నివారించి పేదలను ఆదుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గోడిశాల వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేపు నవంబర్ 6న హైదరాబాద్‌లోని CRD కార్యాలయం ఎదుట తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ నవంబర్ 5న కేసముద్రం మండలం లోని విలేజ్ కేసముద్రం వివిధ కాలనీలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గోడిశాల వెంకన్న మాట్లాడుతూ జిల్లాలో...