Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

హరీష్ రావు, కేటీఆర్‌లు గడ్డాలు, దుస్తులు కాదు... ఆలోచనా విధానం మార్చుకోవాలి

Author
Posted By Telangana Vaartha
| 05 Nov 2026, 06:10 PM | తాజావార్తలు Flash News
హరీష్ రావు, కేటీఆర్‌లు గడ్డాలు, దుస్తులు కాదు... ఆలోచనా విధానం మార్చుకోవాలి

హరీష్ రావు, కేటీఆర్‌లు గడ్డాలు, దుస్తులు కాదు... ఆలోచనా విధానం మార్చుకోవాలి

షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ప్రతిపక్షాల రాద్ధాంతంపై మండిపడ్డ షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

రైతుల ముసుగులో గులాబీ నేతల అబద్ధాల ప్రచారం

క్షేత్రస్థాయిలో సాగునీరు, విద్యుత్‌కు కొరతే లేదు

పదవి పోయిందన్న ఆక్రోశంతో గులాబీ కండువాలు కప్పుకొని రైతుల ముసుగులో నిరసనల పేరిట రాద్ధాంతం చేస్తున్నారని హరీష్ రావు, కేటీఆర్‌లు గడ్డాలు, దుస్తులు కాదు... ఆలోచనా విధానం మార్చుకోవాలనీ షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఎద్దేవా చేశారు. ఫరూక్ నగర్ మండలం చించోడు గ్రామంలో పంటలు పరిశీలన అనంతరం స్థానిక మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.
గత పదేళ్ల పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా స్కామ్‌లు చేసి, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ప్రజలను పిప్పి చేశారని ఆరోపించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ సంక్షేమ పాలనందిస్తుంటే, ఓర్వలేక ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నాయని షాద్‌నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చించోడు గ్రామంలో వెంకట్ రెడ్డి అనే రైతు ఎనిమిది ఎకరాలలో వరి పంటను వేయగ రైతుతో కలిసి పంటను పరిశీలించారు.

ఇవి కూడా చదవండి

క్షేత్రస్థాయిలో సంతృప్తికరంగా రైతులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు రుణాలు మాఫీ చేయడంతో పాటు, రైతుబంధు, సబ్సిడీలు మరియు సాగుకు అవసరమైనంత ఉచిత విద్యుత్తును నిరంతరాయంగా అందిస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు తానే స్వయంగా కిషన్ నగర్, చౌలపల్లి, చించోడు తదితర గ్రామాల్లో పర్యటించినట్లు వెల్లడించారు. చించోడు గ్రామానికి చెందిన వెంకటరెడ్డి అనే రైతు 8 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారని, పొలాలకు నీరు బాగానే అందుతోందని, విద్యుత్ సమస్యల్లేవని స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. ఎక్కడైనా సాంకేతిక సమస్యల వల్ల ఒక్క మడి ఎండిపోతే దాన్నే పెద్దది చేసి చూపుతూ ప్రతిపక్ష నాయకుడు హరీష్ రావు శవ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

పిప్పి చేసి... అప్పుల కుప్పగా మార్చారు:

పదవి పోయిందన్న ఆక్రోశంతో గులాబీ కండువాలు కప్పుకొని రైతుల ముసుగులో నిరసనల పేరిట రాద్ధాంతం చేస్తున్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. గత పదేళ్ల పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా స్కామ్‌లు చేసి, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ప్రజలను పిప్పి చేశారని ఆరోపించారు. వారి కుటుంబంలోనే దోచుకున్న సొమ్ముపై ఆరోపణలు బయటపడుతున్నాయని పేర్కొన్నారు. కేటీఆర్, హరీష్ రావు గార్లు తమ మార్చుకోవాల్సింది గడ్డాలు, వేషధారణ కాదని... రైతులపై ఉన్న వారి వికృతమైన ఆలోచనా విధానాన్ని, బుద్ధిని మార్చుకోవాలని హితవు పలికారు.

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం:

తమ సొంత ఫామ్‌హౌస్‌లను మాత్రం పచ్చగా ఉంచుకుంటూ, బయట రైతుల పొలాలు ఎండిపోతున్నాయంటూ అబద్ధాల ప్రచారం చేయడం వారి నైజమని నిలదీశారు. తెలంగాణ ప్రజలు, రైతులు ప్రతిపక్షాల టక్కుటమార విద్యలను, మోసపూరిత మాటలను ఎంతమాత్రం నమ్మరని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా రైతు బిడ్డ అని, రైతు కష్ట సుఖాలు ఆయనకు బాగా తెలుసని, రాష్ట్రంలో రైతు సంక్షేమ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు...

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.