Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఎల్‌నినో పరిస్థితుల్లో పంటల యాజమాన్యంపై రైతులకు అవగాహన

Author
Posted By Telangana Vaartha
| 04 Nov 2026, 06:03 PM | తాజావార్తలు Flash News
ఎల్‌నినో పరిస్థితుల్లో పంటల యాజమాన్యంపై రైతులకు అవగాహన

జోగులాంబ గద్వాల 4 నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. ఇటిక్యాల . ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో కూరగాయలు, ఆయిల్‌పామ్ మరియు ఇతర పండ్ల పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంటల యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు సాతర్ల గ్రామము ఇటిక్యాల మండలంలోని రైతు వేదికలో శిక్షణ మరియు అవగాహన కార్యక్రమం సాతర్ల గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
అలంపూర్ తాలూకా ఉద్యానశాఖ అధికారి ఇమ్రానా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది రైతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన అధికారి రాజ్‌కుమార్ పండ్ల పరిశోధన స్థానం, కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మోజర్ల , కొత్తకోట శాస్త్రవేత్త డాక్టర్ షహనాజ్ మేడమ్ Entomology,రైతులకు మిర్చి పంటలో చీడపీడలు వాటి సంరక్షణ మరియు నివారణ చర్యలు కూరగాయల పంటలలో అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం మరియు నీటి కొరత వంటి పరిస్థితుల్లో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను వివరించారు. ముఖ్యంగా నీటి పొదుపు, డ్రిప్‌ ఇరిగేషన్ వినియోగం, నేలలో తేమ సంరక్షణ, మల్చింగ్, సమతుల్య ఎరువుల వినియోగం మరియు చీడపీడల నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు.

అదేవిధంగా ఆయిల్‌పామ్ మరియు ఇతర పండ్ల తోటల్లో నీటి యాజమాన్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ఉద్యానశాఖ అధికారులు సూచించారు. అధిక ఉష్ణోగ్రతల సమయంలో మొక్కలకు తగినంత తేమ అందించడం ద్వారా పంట దిగుబడిపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అలంపూర్ ఉద్యానశాఖ అధికారి, ఇటిక్యాల మండల వ్యవసాయ అధికారి రవికుమార్ మరియు టీజీ ఆయిల్ఫేడ్ డిస్టిక్ ఇంచార్జ్ కరుణశ్రీ ఏఈఓ, హెచ్ ఈ ఓ,ఇతర ఉద్యానశాఖ సిబ్బంది మరియు సుమారు 100 మంది రైతులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.