ఎల్‌నినో పరిస్థితుల్లో పంటల యాజమాన్యంపై రైతులకు అవగాహన

జోగులాంబ గద్వాల 4 నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. ఇటిక్యాల . ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో కూరగాయలు, ఆయిల్‌పామ్ మరియు ఇతర పండ్ల పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంటల యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు సాతర్ల గ్రామము ఇటిక్యాల మండలంలోని రైతు వేదికలో శిక్షణ మరియు అవగాహన కార్యక్రమం సాతర్ల గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అలంపూర్ తాలూకా ఉద్యానశాఖ అధికారి ఇమ్రానా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన అధికారి రాజ్‌కుమార్ పండ్ల పరిశోధన స్థానం, కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మోజర్ల , కొత్తకోట శాస్త్రవేత్త డాక్టర్ షహనాజ్ మేడమ్...