Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

అర్వపల్లి దర్గా ఉర్సుకు ఏర్పాట్లు పూర్తి..6న గంధం ఊరేగింపు.. 7న చిరాగ్‌

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 04 Nov 2026, 08:57 AM | తెలంగాణ Telangana
అర్వపల్లి దర్గా ఉర్సుకు ఏర్పాట్లు పూర్తి..6న గంధం ఊరేగింపు..  7న చిరాగ్‌

జాజిరెడ్డిగూడెం 04 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న అర్వపల్లి దర్గా ఉర్సు ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అర్ధపల్లి శివారులోని పర్వత శ్రేణుల మధ్య కొలువైన హజ్రత్ సయ్యద్ ఖాజా నసీరుద్దీన్ బాబా దర్గా వద్ద వచ్చే నెల 6, 7 తేదీల్లో ఉర్సు ఉత్సవాలు నిర్వహించనున్నారు.ఉత్సవాల నిర్వహణకు సంబంధించి వక్ఫ్ బోర్డు రాష్ట్ర, జిల్లా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పరిశీలించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్యారోగ్య, పోలీసు శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు.ఉర్సు ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 6న అర్ధపల్లి పోలీస్‌స్టేషన్‌ నుంచి గంధం ఊరేగింపు వైభవంగా ప్రారంభం కానుంది. రాత్రి దర్గా వద్ద ప్రత్యేక ఖవ్వాలి కార్యక్రమం నిర్వహించనున్నారు. 7న బాబా సన్నిధిలో భక్తిశ్రద్ధలతో దీపారాధన (చిరాగ్‌) కార్యక్రమం జరగనుంది. ఉత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. ముస్లింలతో పాటు హిందువులు సైతం పెద్ద సంఖ్యలో హాజరై బాబాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని జాతీయ రహదారి-365 నుంచి దర్గాకు వెళ్లే రహదారిపై తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వక్ఫ్ బోర్డు రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ అమీర్ అహ్మద్, జిల్లా ఇన్‌స్పెక్టర్ దస్తగిరి తెలిపారు.

అర్వపల్లి దర్గా ఉర్సుకు ఏర్పాట్లు పూర్తి..6న గంధం ఊరేగింపు..  7న చిరాగ్‌ - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.