అర్వపల్లి దర్గా ఉర్సుకు ఏర్పాట్లు పూర్తి..6న గంధం ఊరేగింపు.. 7న చిరాగ్‌

జాజిరెడ్డిగూడెం 04 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న అర్వపల్లి దర్గా ఉర్సు ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అర్ధపల్లి శివారులోని పర్వత శ్రేణుల మధ్య కొలువైన హజ్రత్ సయ్యద్ ఖాజా నసీరుద్దీన్ బాబా దర్గా వద్ద వచ్చే నెల 6, 7 తేదీల్లో ఉర్సు ఉత్సవాలు నిర్వహించనున్నారు.ఉత్సవాల నిర్వహణకు సంబంధించి వక్ఫ్ బోర్డు రాష్ట్ర, జిల్లా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పరిశీలించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్యారోగ్య, పోలీసు శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు.ఉర్సు ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 6న అర్ధపల్లి పోలీస్‌స్టేషన్‌ నుంచి గంధం ఊరేగింపు వైభవంగా ప్రారంభం కానుంది. రాత్రి దర్గా వద్ద...