Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఇన్‌చార్జి చైర్‌పర్సన్ల నియామకం

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఇన్‌చార్జి చైర్‌పర్సన్ల నియామకం

అలంపూర్ నియోజకవర్గంలోని 7 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రత్యామ్నాయ నాన్‌-అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జి చైర్‌పర్సన్ల నియామకం
రైతులకు సహకార సేవలు మరింత సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వ నిర్ణయం
జిల్లా సహకార అధికారి కె.టైటస్ పాల్
జోగులాంబ గద్వాల3నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:-
అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని ఏడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రత్యామ్నాయ నాన్‌-అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జి చైర్‌పర్సన్లను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా సహకార అధికారి కె.టైటస్ పాల్ మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. తెలంగాణ సహకార సంఘాల చట్టం, 1964లోని సెక్షన్ 32(7)(a) ప్రకారం రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార శాఖ జారీ చేసిన జి.ఓ.ఆర్.టి. నంబర్లు 752, 753, 756, 757, 758, 759, 760,తేదీ 28-10-2026 ఉత్తర్వుల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.ఈ ఉత్తర్వుల ప్రకారం అయిజ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి కుర్వ సుజాత,కలుగోట్ల సంఘానికి బి. శ్రీకాంత్, వడ్డేపల్లి సంఘానికి ఈ. నాగరాజు, మనవపాడు సంఘానికి బి. రామచంద్ర రెడ్డి, క్యాతూర్ సంఘానికి ఈ.నర్సన్ గౌడ్, అలంపూర్ సంఘానికి పెద్ద అయ్యన్న, పుటాన్‌దొడ్డి సంఘానికి బోయ మధు నాయుడు ఇన్‌చార్జి చైర్‌పర్సన్లుగా నియమితులయ్యారని తెలిపారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు గ్రామీణ ప్రాంత రైతులకు వ్యవసాయ రుణాలు, ఎరువులు, విత్తనాల సరఫరా తదితర సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా సహకార అధికారి పేర్కొన్నారు.ఈ నియామకాలతో అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిపాలనా వ్యవహారాలు మరింత సమర్థవంతంగా కొనసాగుతాయని జిల్లా సహకార అధికారి కె. టైటస్ పాల్ తెలిపారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.