Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

AIKS జాతీయ 36వ మహాసభల పోస్టర్, కరపత్రాల ఆవిష్కరణ

Author
Posted By Telangana Vaartha
| 03 Nov 2026, 06:14 PM |
AIKS జాతీయ 36వ మహాసభల పోస్టర్, కరపత్రాల ఆవిష్కరణ

ఈ నెల 15నుండి 18వరకు నల్గొండ లో జరిగే AIKS జాతీయ 36వ మహాసభల పోస్టర్, కరపత్రాల ఆవిష్కరణ
రైతు సమస్యల పరిష్కారం కోసం రైతులు ఐక్యంగా ఉద్యమించాలి – గోడిశాల వెంకన్న
ఈ రోజు ఇనుగుర్తి మండలం లో ఈ నెల 15 నుండి 18వ తేదీ వరకు నల్గొండలో జరిగే అఖిల భారత కిసాన్ సభ (AIKS) జాతీయ 36వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించేందుకు పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా CPM కేసముద్రం మండల కార్యదర్శి గోడిశాల వెంకన్న మాట్లాడుతూ, ఇనుగుర్తి, కేసముద్రం మండలాలను కరువు మండలాలుగా గుర్తించి ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏలోని ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే పంట నష్టపరిహారం అందించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి, పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకొని రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 15న నల్గొండలో జరిగే రైతు సంఘం భారీ బహిరంగ సభకు రైతులు, వ్యవసాయ కార్మికులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతాంగ హక్కుల సాధన కోసం జరిగే AIKS జాతీయ 36వ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో బండి సత్యం, కావటి నర్సయ్య, ఆవుల ఉప్పలయ్య, మట్టెపల్లి హరీష్, యాకుబ్, సట్ల యాకన్న, రాజు, తోట యకమ్మ, SK యాకుబ్, తదితరులు పాల్గొన్నారు

రైతును ఆదుకోవాలి – దేశాన్ని కాపాడాలి!

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.