AIKS జాతీయ 36వ మహాసభల పోస్టర్, కరపత్రాల ఆవిష్కరణ

ఈ నెల 15నుండి 18వరకు నల్గొండ లో జరిగే AIKS జాతీయ 36వ మహాసభల పోస్టర్, కరపత్రాల ఆవిష్కరణ రైతు సమస్యల పరిష్కారం కోసం రైతులు ఐక్యంగా ఉద్యమించాలి – గోడిశాల వెంకన్న ఈ రోజు ఇనుగుర్తి మండలం లో ఈ నెల 15 నుండి 18వ తేదీ వరకు నల్గొండలో జరిగే అఖిల భారత కిసాన్ సభ (AIKS) జాతీయ 36వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించేందుకు పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా CPM కేసముద్రం మండల కార్యదర్శి గోడిశాల వెంకన్న మాట్లాడుతూ, ఇనుగుర్తి, కేసముద్రం మండలాలను కరువు మండలాలుగా గుర్తించి ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్...