Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

నవంబర్ 10 న కలెక్టరేట్ ముట్టడి

Author
Posted By Telangana Vaartha
| 03 Nov 2026, 06:10 PM | తెలంగాణ Telangana
నవంబర్ 10 న కలెక్టరేట్ ముట్టడి

మహబూబాబాద్ జిల్లా ను కరువు జిల్లాగా ప్రకటించాలి
నవంబర్ 5 6 7 కరువు ప్రాంతాల పరిశీలన
సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారధి వెల్లడి
మహబూబాబాద్:-</b> భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మహబూబాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యుల మరియు మండల కార్యదర్శులు సమావేశం నేడు 18 వ వార్డు కౌన్సిలర్ దేశపల్లి నవీన్ అధ్యక్షతన స్థానిక జిల్లా కార్యాలయం వీరభవన్ లో జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి మాట్లాడుతూ మానుకోట జిల్లాను కరువు జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు కొన్ని మండలాలనే ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకుందని కానీ జిల్లాలో ఉన్న అన్ని మండలాలతో పాటు జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కరువు ప్రాంతాలను పరిశీలించడానికి సిపిఐ బృందం నవంబర్ 5 6 7 లో జిల్లాలో పర్యటిస్తుందన్నారు ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతూ కరువు జిల్లాగా ప్రకటించాలని కోరుతూ నవంబర్ 10న జిల్లా కలెక్టరేట్ ముట్టడించబోతున్నట్టు బి విజయసారథి తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతాంగం పాల్గొనబోతున్నారని తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితుల వల్ల రైతాంగం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు పంటలు చేతికొచ్చే సమయానికే కరువు వల్ల చేతికి రాకుండా పోయాయన్నారు ముఖ్యంగా చెరువులు ఎండిపోయి రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని అన్నారు కృత్రిమ బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని బియ్యం ధరను అదుపులో ఉంచాలని కరువు సమయంలో అధిక ధరలను నియంత్రించాలని తెలిపారు పశు సామాగ్రిని సరఫరా చేయాలని రైతులకు ఉచితంగా విత్తనాలు సరఫరా చేయాలని రైతు రుణమాఫీ చేయాలని రైతులకు అన్ని విధాల ఆదుకోవాలని అన్నారు ఈ సందర్భంగా కరువు ప్రాంతాలను రైతాంగ సమస్యలను తెలుసుకోవడానికి నవంబర్ 5 6 7 తేదీల్లో జిల్లాలో కరువు ప్రాంతాలను సిపిఐ బృందం పరిశీలించనున్నదని తెలిపారు వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత నవంబర్ 10న మహబూబాద్ జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించబోతున్నట్టు వేలాది మంది రైతులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి అజయ్ సారధి రెడ్డి నల్లు సుధాకర్ రెడ్డి కట్టెబోయిన శ్రీనివాస్ నేతలు పెరుగు కుమార్ చింతకుంట్ల వెంకన్న వరిపల్లి వెంకన్న నెల్లూరు నాగేశ్వరరావు చొప్పరి శేఖర్ తండా సందీప్ బైసా స్వామి జంపాల వెంకన్న గంజి శేషాద్రి రెడ్డి బందు మహేందర్ మారగాని బాలకృష్ణ రవీందర్ సారిక శ్రీనివాస్

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.