Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

డిఈఓ తనిఖీతో మన్నాపూర్ స్కూల్లో కలకలం

Author
Posted By A.Timma Gurudu
| 03 Nov 2026, 06:00 PM |
డిఈఓ తనిఖీతో మన్నాపూర్ స్కూల్లో కలకలం

మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన మరియు రుచికరమైన భోజనం అందించాలి.
గుడ్లు పెట్టలేదా...? అయితే ఊరుకోం - టీచింగ్ డైరీ లేకుంటే కుదరదు.
మండలపరిధిలోని ఎంపీయూపీఎస్ మన్నాపూర్ పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారి కె. విజయలక్ష్మి ఆకస్మికంగా సందర్శించారు. దీంతో పాఠశాలలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.
తరగతి గదిలోకి డిఈఓ
ఈ సందర్భంగా 3వ తరగతి తెలుగు పాఠ్యాంశ బోధనను, 8వ తరగతి ఆంగ్ల ఉపాధ్యాయుని తరగతి గది బోధనను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి అభ్యసన స్థాయిని తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఆసక్తికరమైన బోధనా పద్ధతులను అనుసరిస్తూ, ప్రతి విద్యార్థి అభ్యసన పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.నిర్దేశించిన పాఠ్య ప్రణాళిక ప్రకారం బోధన చేపట్టడంతో పాటు ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా టీచింగ్ డైరీని క్రమం తప్పకుండా రాయాలని ఆదేశించారు.
మధ్యాహ్న భోజనంపై సీరియస్
అనంతరం మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలిస్తూ, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన మరియు రుచికరమైన భోజనం అందించాలని సూచించారు. మెనూలో నిర్దేశించిన విధంగా విద్యార్థులకు వారంలో మూడు రోజులు గుడ్లు తప్పనిసరిగా అందించాలని స్పష్టం చేశారు.
పాఠశాలలో ఫుడ్ కమిటీని ఏర్పాటు చేసి, భోజనం వడ్డించే ముందు సంబంధిత బాధ్యులు ఆహార నాణ్యతను రుచి చూసి పరిశీలించాలని, ఇందుకు సంబంధించి తప్పనిసరిగా ఫుడ్ టేస్టింగ్ రిజిస్టర్ ను నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు.
పాఠశాలలో విద్యా ప్రమాణాల పెంపుతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం మరియు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని డిఈఓ సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మురళీధర్, ఉపాధ్యాయులు ప్రకాష్, అస్లాం, సునీత, మరియు సిఆర్పి నర్సింలు పాల్గొన్నారు.

డిఈఓ తనిఖీతో మన్నాపూర్ స్కూల్లో కలకలం - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.