డిఈఓ తనిఖీతో మన్నాపూర్ స్కూల్లో కలకలం
మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన మరియు రుచికరమైన భోజనం అందించాలి. గుడ్లు పెట్టలేదా...? అయితే ఊరుకోం - టీచింగ్ డైరీ లేకుంటే కుదరదు. మండలపరిధిలోని ఎంపీయూపీఎస్ మన్నాపూర్ పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారి కె. విజయలక్ష్మి ఆకస్మికంగా సందర్శించారు. దీంతో పాఠశాలలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. తరగతి గదిలోకి డిఈఓ ఈ సందర్భంగా 3వ తరగతి తెలుగు పాఠ్యాంశ బోధనను, 8వ తరగతి ఆంగ్ల ఉపాధ్యాయుని తరగతి గది బోధనను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి అభ్యసన స్థాయిని తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఆసక్తికరమైన బోధనా పద్ధతులను అనుసరిస్తూ, ప్రతి విద్యార్థి అభ్యసన పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.నిర్దేశించిన...