Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

చెత్త చెదారం ప్లాస్టిక్ కవర్లతో నిండిపోయిన గద్వాల్ మున్సిపాలిటీ

Author
Posted By Telangana Vaartha
| 25 Oct 2026, 06:36 PM | తాజావార్తలు Flash News
చెత్త చెదారం ప్లాస్టిక్ కవర్లతో  నిండిపోయిన గద్వాల్ మున్సిపాలిటీ

అధికారుల పర్యవేక్షణ శూన్యం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందనంగా.
జోగులాంబ గద్వాల 25 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.
గద్వాల.పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డు కౌన్సిలర్లు చెత్తాచెదారం ప్లాస్టిక్ కవర్లతో రోడ్డు పక్కనే దర్శనమిస్తున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడని విమర్శలు ఉన్నాయి. మున్సిపాలిటీ పరిసరాల పరిశుభ్రత లో అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వలన పరిసరాలు చెత్త సేకరణ పనులు పూర్తిస్థాయిలో చేయని దుస్థితి ఏర్పడింది. అధికారులు పర్యవేక్షణ ఉంటే చెత్త సేకరణ పనులు పూర్తి జరిగేవని గద్వాల్ మున్సిపాలిటీ పరిధిలో పరిసరాల అపరిశుభ్రత లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందనంగా గద్వాల్ మున్సిపాలిటీ కొనసాగుతుంది. విధుల. నిర్వహణలో అధికారులు బాధ్యతలు చేపట్టిన మున్సిపాలిటీ పరిసరాల పరిశుభ్రత పై దృష్టి పెట్టడం లేదని విమర్శలు ఉన్నాయి. గద్వాల రింగ్ రోడ్డు మెడికల్ కాలేజీ సమీపంలోనూ వైస్ దుకాణాల చికెన్ మటన్ సెంటర్లోని ప్లాస్టిక్ కవర్లు రోడ్డు పక్కనే పాడవేయడం పరిసరాలు దుర్వాసనతో అపరిశుభ్రంగా మారి నిత్య అనారోగ్యాలకు దారి చూస్తున్నాయి. మార్కెట్ యార్డు సమీపంలోనూ రోడ్డుపక్కలకే ప్లాస్టిక్ టీ కప్పులను వేయడంతో అక్కడ పరిసరాలు ఈగలు దోమలతో వ్యాప్తి చెందడం అవకాశం గా మారింది అని చెప్పవచ్చు. గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని 37 వార్డు కౌన్సిలర్లను పరిస్థితి అధ్వానంగా తయారవుకముందే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారుల పైన ఉన్నది. హాస్టల్లోనూ ప్రభుత్వ పాఠశాల పరిసరాలు వైన్స్ దుకాణాలు. టీ కొట్టు దుకాణాలు హోటల్లు తదితర ప్రాంతాల్లోని ఇటువంటి వేస్ట్ డబ్బాలు లేకుండా ఏర్పాటు చేయకపోవడం వలన నిత్యము కొనసాగే దుకాణాల్లోనే అపరిశుభ్రత బయటపరమైన వలన రోడ్లమీద వేయడం వలన రోజు చెత్త సేకరణ పని తొలగించడంలో పూర్తిస్థాయిలో కొనసాగిపోవడం వలన పేరుకపోవడం జరుగుతుందని స్థానికులు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని చెత్త సేకరణ పూర్తిస్థాయిలో చేయాలని స్థానికులు కోరుతున్నారు.

జనాభా ప్రాతిపదికన పరిశుద్ధ కార్మికులను ఏర్పాటు చేయాలి: గద్వాల్ మున్సిపాలిటీ పరిధిలోని 37 వార్డ్ కౌన్సిలర్లు లో సుమారు 50వేల జనాభా వరకు ఉంటుంది జనాభా ప్రతిపాదిక ప్రకారము పరిశుద్ధ కార్మికులను నియమించాల్సిన అవసరం అధికారుల పైన ఉన్నది. సర్దుబాటు పేరుతో అరకొర పరిశుద్ధ కార్మికులను ఏర్పాటు చేసి చెత్త సేకరణ స్థాయిలో చేయడం అసంభవం. డ్రైనేజీలు. మురిసి కాలువలు గుంతలు తదితర వంటి సమస్యలు పరిష్కరించడం సాధ్యం కాని పరిస్థితి ఉంటుంది. ప్రతి దుకాణానికి వేస్ట్ డబ్బాలను బుట్టాలు ఏర్పాటు నిర్వహణకు చర్య తీసుకోవాల్సిన బాధ్యత అధికారుల పైన ఉన్నది. మున్సిపాలిటీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. పరిశుభ్రతపై పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఆధారపడి ఉన్నది. ప్రతి ఒక్కరూ దుకాణదారి యజమానుడు సిబ్బంది అప్రమత్తని వివరిస్తే పరిసర పరిశుభ్రతతో పాటు ఆరోగ్యంగా జీవించేందుకు అవకాశం మెండుగా ఉంటుంది. దీనికి తోడు పరిశుద్ధ కార్మికులను సంఖ్య పెంచి ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ స్కూల్లో కవర్లు ప్లాస్టిక్ ప్లేట్లు తదితరు వంటివిసేకరణ పనులు పూర్తి చేయడానికి అధికారులు చూరతో సాధ్యమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి గద్వాల్ మున్సిపాలిటీ పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

చెత్త చెదారం ప్లాస్టిక్ కవర్లతో  నిండిపోయిన గద్వాల్ మున్సిపాలిటీ - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.