Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

సొంతింటి కలను సాకారం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 07 Oct 2026, 09:52 PM | తెలంగాణ Telangana
సొంతింటి కలను  సాకారం రాష్ట్ర ప్రభుత్వ  లక్ష్యం

తిరుమలగిరి 08 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. బుధవారం తిరుమలగిరి మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇళ్లులేని పేదలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇందిరమ్మ ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. తుంగతుర్తి నియోజకవర్గానికి తొలి విడతలో 3,500 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ప్రస్తుత విడతలో 2,000 ఇళ్లు కేటాయించగా, 1,500 ఇళ్లకు రూ.5 లక్షలు, ఇప్పటికే రేకులు వేసుకుని గోడలు పూర్తిచేసుకున్న మరో 500 ఇళ్లకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు వివరించారు. నియోజకవర్గంలోని 9 మండలాలు, 2 మున్సిపాలిటీలకు ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు అన్నారు. దసరా నాటికి రాష్ట్రంలో 2 లక్షల ఇందిరమ్మ ఇళ్లు పూర్తికానున్నాయని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమంలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. లబ్ధిదారులు మంజూరు పత్రాలు అందుకున్న వెంటనే ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే సూచించారు. నిర్మాణ సమయంలో తనను సంప్రదిస్తే సర్పంచ్‌లు, కౌన్సిలర్లతో కలిసి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమకారుడిగా తన చేతుల మీదుగా పేదలకు రూ.5 లక్షల విలువైన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించడం గర్వంగా ఉందన్నారు. అనంతరం మున్సిపాలిటీకి చెందిన 184 లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా మంజూరు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి ధర్మారావు మున్సిపల్ కమిషనర్ వెంకన్న మండల పార్టీ అధ్యక్షులు సుంకరి జనార్ధన్ పేరాల వీరేష్ జుమ్మిలాల్ వార్డు కౌన్సిలర్స్ మల్లయ్య యాదగిరి కవిత శ్రీనివాస్ ప్రెస్ కన్వీనర్ కందుకూరి లక్ష్మయ్య ,దుంపల కృష్ణారెడ్డి కృష్ణ నాయక్ పలు గ్రామాల సర్పంచులు 14 వార్డుల ఇన్చార్జీలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లబ్ధిదారులు మహిళలు తదితరులు పాల్గొన్నారు...

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.