సొంతింటి కలను సాకారం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
తిరుమలగిరి 08 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. బుధవారం తిరుమలగిరి మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇళ్లులేని పేదలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇందిరమ్మ ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. తుంగతుర్తి నియోజకవర్గానికి తొలి విడతలో 3,500 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ప్రస్తుత విడతలో 2,000 ఇళ్లు కేటాయించగా, 1,500 ఇళ్లకు రూ.5 లక్షలు, ఇప్పటికే...