Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలి -

Author
Posted By Telangana Vaartha
| 05 Oct 2026, 11:32 PM |
పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలి -

ముఖ్యమైన పాయింట్స్:

  • జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రుల రాక నేపథ్యంలో పనుల పరిశీలన
పులిచింతల ప్రాజెక్టు
గడ్డిపల్లి పాఠశాల, సయ్యద్ ముజావర్ పేట ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సహా రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేపు సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ప్రజాప్రతినిధుల రాక, పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ స్థానికంగా అధికారులతో కలిసి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మంత్రులు ముందుగా పులిచింతల హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సమీపంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారని పులిచింతల హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌ను సందర్శించి, TG GENCO మరియు ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని తదుపరి గరిడేపల్లి మండలం గడ్డిపల్లి లో రూ. 200 కోట్లతో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను పరిశీలిస్తారని, గడ్డిపల్లి నుంచి హెలికాప్టర్‌లో మునగాలకు చేరుకుంటారని మునగాలలో రూ.9.60 కోట్లు హరే కృష్ణ మిషన్ ఆధునిక కమ్యూనిటీ కిచెన్‌కు భూమిపూజ చేస్తారని అన్నారు. ముందుగా గడ్డిపల్లిలోని ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మాణ ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్ పర్యటన సమయానికి అంతా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మునగాల మండలం సయ్యద్ ముజావర్ పేటలో నూతనంగా నిర్మించనున్న 'కమ్యూనిటీ కిచెన్' శంకుస్థాపన స్థలాన్ని, పులిచింతల మినీ హైడ్రాల్ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ చేపట్టాల్సిన వేదిక ఏర్పాటు, భద్రత, ప్రోటోకాల్ అంశాలపై సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఎలాంటి లోటూ రానివ్వొద్దు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... "ముఖ్య నాయకులు, మంత్రుల పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పులిచింతల ప్రాజెక్ట్, గడ్డిపల్లి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, మునగాల శంకుస్థాపన ప్రాంగణాల వద్ద ట్రాఫిక్, భద్రత, తాగునీరు తదితర ప్రాథమిక సౌకర్యాల్లో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూసుకోవాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ ఆర్డీవో శ్రీనివాసులు, కోదాడ ఆర్టీవో సూర్యనారాయణ జన్కో సి నందేశ్ కుమార్ నారాయణ సింగ్ దేశ నాయక్ ఎస్సీ జెన్కో సిబ్బంది తాసిల్దారులు తదితరులు పాల్గొన్నారు

పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలి - - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.