Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

మునగాల గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

Author
Posted By A.Timma Gurudu
| 26 Sep 2026, 05:18 PM | తాజా సమాచారం
మునగాల గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

జోగులాంబ గద్వాల 26 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి ఇటిక్యాల మండలంలో
మునగాల గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. సందర్బంగా మునగాల గ్రామ సర్పంచ్& ఇటిక్యాల మండలం సర్పంచ్ సంఘం అధ్యక్షుడు కొప్పుల ప్రభాకర్ రెడ్డి పూల మాల వేసి నివాళులు అర్పిచారు. ఆయనసర్పంచ్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ) తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నిజాం నవాబు మరియు రజాకార్లు, విస్నూర్ దేశ్‌ముఖ్ వంటి భూస్వామ్య అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ధీర వనిత, విప్లవ నాయకురాలు. ముఖ్య వివరాలు జననం: సెప్టెంబర్ 26, 1895 (వరంగల్ జిల్లా, రామపర్తి మండలం, కిష్టాపూర్ గ్రామం).మరణం: సెప్టెంబర్ 10, 1985.పోరాట స్ఫూర్తి: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటంలో తన ఇంటినే కార్యాలయంగా మార్చి, రజాకారులను, భూస్వాములను ధైర్యంగా ఎదిరించారు.గుర్తింపు: తెలంగాణ ప్రభుత్వం ఆమె జయంతిని (సెప్టెంబర్ 26) అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో చాకలి మద్దిలేటి వార్డ్ మెంబెర్స్ రాజ్ కుమార్ రెడ్డి చాకలి చంద్రన్న మునగాల రజక సంఘం సభ్యులు వెటర్నరీ డాక్టర్ మంద రాముడు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.