Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఊహించినదే జరిగింది..

Author
Posted By Telangana Vaartha
| 18 Nov 2026, 11:05 AM | క్రీడలు Sports
కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఊహించినదే జరిగింది..

telanganavaartha:- కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఊహించినదే జరిగింది.. కానీ గుండెను బరువెక్కించే ఆ క్షణం వచ్చేసింది. ఐపీఎల్ 2027 రిటెన్షన్ తుది గడువు ముగుస్తున్న వేళ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఒక ఎమోషనల్ ప్రకటన చేసింది. భారత క్రికెట్ దిగ్గజం, సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రాబోయే ఐపీఎల్ 2027 సీజన్‌కు ధోనీని ఆటగాడిగా రిటైన్ చేసుకోవడం లేదని, అతడు ఆటకు వీడ్కోలు పలికి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మెంటార్ గా కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడని ఫ్రాంచైజీ అధికారికంగా వెల్లడించింది...
గాయాలతో ఐపీఎల్ కు ధోనీ వీడ్కోలు..!!
2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఎంఎస్ ధోనీ కేవలం ఐపీఎల్‌లో మాత్రమే అభిమానులను అలరిస్తూ వచ్చాడు. అయితే గత కొన్నేళ్లుగా అతడిని ఫిట్‌నెస్ సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. మోకాలికి గాయం.. గతంలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న ధోనీ, ఆ తర్వాత కండరాల గాయం, బొటనవేలి గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
రెండేళ్లుగా మైదానానికి దూరం:
ధోనీ చివరిసారిగా ఒక ప్రొఫెషనల్ క్రికెట్ మ్యాచ్ ఆడి దాదాపు రెండేళ్లు పూర్తయింది. వయసు, ఫిట్‌నెస్ దృష్ట్యా ఇక ఆటగాడిగా కొనసాగడం సాధ్యం కాదని భావించిన మిస్టర్ కూల్, ఆటకు గుడ్ బై చెప్పి డగౌట్ నుంచి జట్టును నడిపించాలని నిర్ణయించుకున్నాడు.
డ్రెస్సింగ్ రూమ్‌లో ఇక ధోనీ వ్యూహాలు:
చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోనీ.. ధోనీ అంటే చెన్నై సూపర్ కింగ్స్.. ఆరంభ సీజన్ నుంచి జట్టును ముందుండి నడిపించి ఐదు ఐపీఎల్ టైటిళ్లను అందించిన ధోనీకి, చెపాక్ స్టేడియంతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆటగాడిగా మైదానంలోకి దిగకపోయినా, టీమ్ మెంటార్ హోదాలో డ్రెస్సింగ్ రూమ్‌లో ధోనీ ఉనికి యువ ఆటగాళ్లకు కొండంత బలాన్ని ఇస్తుందని, ఫ్రాంచైజీ బ్రాండ్ విలువకు అతడి వ్యూహాలు ఎంతో కీలకమని సీఎస్‌కే యాజమాన్యం పేర్కొంది.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.