Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఆదివాసి యువకుడు తెల్లం శరత్ ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి .

Author
Posted By Telangana Vaartha
| 18 Nov 2026, 02:33 AM |
ఆదివాసి యువకుడు తెల్లం శరత్ ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి .

అక్రమ నిర్మాణ లాడ్జిలను కూల్చివేయాలి .
ఆదివాసి కొండరెడ్ల సంఘం వ్యవస్తాపక గౌరవ అద్యక్షులు ముర్ల రమేష్ డిమండ్ .
తెలంగాణ వార్త నవంబర్ 17 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం:-
దివ్య క్షేత్రం భద్రాచలం లో హత్య ఉదంతం చాల బాదాకరం . నిన్న రాత్రి రామాలయం ప్రాంతంలో రూమ్ కోసం లాడ్జి కి వెళ్లిన ఆదివాసి యూవకుడు(తెల్లం శరత్ )ని కులం పేరుతొ దూషించి , విచక్షణారహితంగా లాడ్జి యజమాని , సిబ్బంది హత్యచేయడం చాలాబాధాకరం . ప్రశాంతంగా ఉండే భద్రాచలంలో ఈ మధ్యకాలంలో ఇలంటి సంఘటనలు జరగటం భద్రాచలం ఉనికికే ప్రమాదం ఏర్పడు తు0దని,ఆదివాసి చట్టాలకు వ్యతిరేకంగా , నిబందనలు పాటించకుండా విచ్చలవిడిగా నిర్మించిన , నిర్మిస్తున్న లాడ్జిలను కూల్చివేయాలి . ఇంటువంటి సంఘటనలు జరగకుండ అధికారులు చర్యలు తీసుకొవాలి . బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆదివాసి కొండరెడ్ల సంఘం వారికి అండగ ఉంటుంది . ఆదివాసి కొండరెడ్ల సంఘం వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులు ముర్ల.రమేష్ పేర్కొన్నారు. శ్రీరాముని దివ్య క్షేత్రంలో భవిష్యత్ లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ అధికారులు నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.