Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

మహిళా భక్తులు దుస్తులు మార్చుకొనే అవకాశం కల్పించిన పురోహిత సంఘం

Author
Posted By Telangana Vaartha
| 16 Nov 2026, 07:33 PM | తాజావార్తలు Flash News
మహిళా భక్తులు దుస్తులు మార్చుకొనే అవకాశం కల్పించిన పురోహిత సంఘం

తెలంగాణ వార్త నవంబర్ 16 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం.భద్రాచలం దివ్య క్షేత్రంలో ప్రతినిత్యం వేలాదిమంది భక్తులు పుణ్య గోదావరిలో స్నానాలు ఆచరిస్తుంటారు. వీరిలో మహిళా భక్తులు కూడా అధికంగానే ఉంటారు. గోదావరి నదీ లో స్నానాలు చేసిన మహిళా భక్తులకు దుస్తులు మార్చుకొనుటకు తగు సౌకర్యం లేకపోవడంతో మహిళాభక్తులు ఇబ్బందులు పడుతుంటారు. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో భక్తుల రాక అధికంగానే ఉంటుంది వీరిలో మహిళా భక్తులకు దుస్తులు మార్చుకునే వసతి తగు విధంగా లేక పోవడంతో మహిళా భక్తులఇబ్బంది అధికంగానే ఉన్నది. భక్తుల ద్వారా వస్తున్న ఆదాయంతో జీవనోపాధి చేస్తున్నందున మహిళా భక్తు లు దుస్తులు మార్చు కునేందుకు వీలుగా తగు సౌకర్యం కల్పించినట్లు భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షులు రామావజ్జల రవికుమార్, పురోహిత సంఘం వారుతెలిపారు.

పురోహితులు
స్నాన ఘట్టాల వద్ద ఉన్నకళ్యాణకట్ట సమీపంలో మహిళలు దుస్తులు మార్చుకునే సౌకర్యం పురోహితులుఏర్పాటు చేశారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.