Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

సజ్జనార్‌కు బదిలీ.. కొత్త సీపీగా మహేష్ భగవత్

Author
Posted By Telangana Vaartha
| 13 Nov 2026, 08:09 PM | Array
సజ్జనార్‌కు బదిలీ.. కొత్త సీపీగా మహేష్ భగవత్

హైదరాబాద్, నవంబర్ 13: తెలంగాణ పోలీస్ శాఖలో కీలక బదిలీలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి వి.సి. సజ్జనార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్‌ను నూతన హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమించింది.
నవంబర్ 12న జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, సజ్జనార్‌కు తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు అప్పగించారు. అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీ బాధ్యతలను కూడా కేటాయించారు. మహేష్ భగవత్ గతంలో తెలంగాణ పోలీస్ శాఖలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ బదిలీల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారులకు కొత్త బాధ్యతలు కేటాయించారు. పోలీస్ శాఖలో చోటుచేసుకున్న ఈ మార్పులు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.