Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

కోదాడలో రూ.50 కోట్లతో నిర్మిస్తున్న నవోదయ విద్యాలయ నిర్మాణ పనుల పరిశీలన

Author
Posted By Telangana Vaartha
| 12 Nov 2026, 07:30 PM | తాజావార్తలు Flash News
కోదాడలో రూ.50 కోట్లతో నిర్మిస్తున్న నవోదయ విద్యాలయ నిర్మాణ పనుల పరిశీలన

నిర్మాణ పనులను వేగవంతం చేసి, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ పట్టణంలోని బాలాజీనగర్‌లో రూ.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న జవహర్ నవోదయ విద్యాలయ భవన నిర్మాణ పనుల పురోగతిని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పరిశీలించారు.

ఈ సందర్భంగా నిర్మాణ పనుల ప్రస్తుత పరిస్థితి, ఇప్పటివరకు పూర్తయిన పనులు, విద్యార్థులకు కల్పించనున్న మౌలిక వసతుల గురించి సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక వసతులు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ పాఠశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నాణ్యతా ప్రమాణాల్లో ఎలాంటి రాజీ లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ శ్రీ రఘువీర్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గారు, జిల్లా ఎస్పీ నర్సింహా గారు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.