Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి – గోడిశాల వెంకన్న

Author
Posted By Telangana Vaartha
| 12 Nov 2026, 07:28 PM | తాజావార్తలు Flash News
రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి – గోడిశాల వెంకన్న

కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఎదుట సీపీఎం ధర్నారైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఎం కేసముద్రం మండల కార్యదర్శి గోడిశాల వెంకన్న డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు సరైన ధరలు లభించక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న గోడిశాల వెంకన్న మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యం, మొక్కజొన్న, పత్తి పంటలకు కనీసం ఈ క్రింది ధరలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

సీపీఎం ప్రధాన డిమాండ్లు:

ఇవి కూడా చదవండి

1. క్వింటా వరి ధాన్యానికి రూ.4,000 చెల్లించాలి.
2. క్వింటా మొక్కజొన్నకు రూ.3,000 చెల్లించాలి.
3. క్వింటా పత్తికి రూ.9,500 చెల్లించాలి.

ప్రభుత్వం రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించి, పంటలకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని, దళారుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు.

ఈ ధర్నా కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను మార్కెట్ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.