Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంపై బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ ఆగ్రహం

Author
Posted By Telangana Vaartha
| 12 Nov 2026, 07:12 PM | తాజావార్తలు Flash News
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంపై బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ ఆగ్రహం

రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న నిర్లక్ష్యం ప్రభుత్వం
అడ్డగూడూరు 12 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:-అడ్డగూడూరు మండల పరిధిలోని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను నేటికీ ప్రారంభించకపోవడంపై బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ,కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.ప్రభుత్వం వెంటనే స్పందించి మండలంలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.కొనుగోళ్లలో జాప్యం వల్ల రైతులు ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు ధాన్యం విక్రయించుకునే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందన్నారు.అధికారులు తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.