Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

మహిళా సమైక్య భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

Author
Posted By Telangana Vaartha
| 11 Nov 2026, 08:55 PM |
మహిళా సమైక్య భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

తెలంగాణ వార్త నవంబర్ 11 జిల్లాస్టాపర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:- భద్రాచలం నియోజకవర్గం,దుమ్ముగూడెం మండలం, రేగుబల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రేగుపల్లి గ్రామంలో మహిళా సమైక్య భవన్ నిర్మాణానికి భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావుకొబ్బరికాయ కొట్టి భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రసంగిస్తూ, మహిళా సమైక్య భవన్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి మహిళలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత బాధ్యులకుసూచించారు. మహిళా సంఘాల కార్యకలాపాలకు ఈ భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల నాయకులు, అభిమానులు, మహిళా సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మహిళా సమైక్య భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.