Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

రహదారిపై గుంతలు పూడ్చి ప్రమాదాల నివారణకు చర్యలు

Author
Posted By Telangana Vaartha
| 11 Nov 2026, 06:07 PM | తాజావార్తలు Flash News
రహదారిపై గుంతలు పూడ్చి ప్రమాదాల నివారణకు చర్యలు

జాతీయ రహదారి–65పై ఈనాడు ఆఫీస్ జంక్షన్ వద్ద గుంతల పూడ్చివేత
సూర్యాపేట పట్టణ పరిధిలోని జాతీయ రహదారి–65పై ఈనాడు ఆఫీస్ జంక్షన్ వద్ద రహదారిపై గుంతలు ఏర్పడి వాహనదారులకు ప్రమాదకరంగా మారడంతో జిల్లా ఎస్పీ కె. నరసింహ, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ పోలీసులు తక్షణ చర్యలు చేపట్టారు. ఈరోజు ట్రాఫిక్ పోలీసులు రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చివేయించారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ యాదవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. వాహనదారులు రహదారులపై ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, వేగాన్ని నియంత్రించుకొని నిదానంగా వాహనాలు నడపాలని సూచించారు. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షిత ప్రయాణం చేయాలని కోరారు.

రహదారిపై గుంతలు పూడ్చి ప్రమాదాల నివారణకు చర్యలు - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.