Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

వైభవంగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ప్రభోత్సవం

Author
Posted By A.Timma Gurudu
| 09 Nov 2026, 11:59 PM | తెలంగాణ Telangana
Video Thumbnail

జోగులాంబ గద్వాల 9 నవంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండలం వెంకటాపురంలో వెలసిన పాగుంట శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ప్రభోత్సవ కార్యక్రమాని సోమవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకాలు, ఆకుపూజ, పుష్పార్చనలు నిర్వహించి స్వామి వారిని పట్టువస్త్రాలు, పూలమాలలతో అలంకరించారు. సాయంత్రం ప్రభను సుందరంగా అలంకరించి ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి మేళతాళాల మధ్య ఊరేగింపు నిర్వహించారు. ప్రభోత్సవ ఊరేగింపు సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేటిదొడ్డి ఎస్ఐ పి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.